Fish.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. దాదాపు నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ తాజాగా మరణించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. 53 సంవత్సరాలు ఉన్న ఫిష్ వెంకట్ కిడ్నీలు అలాగే లివర్ మొత్తం ఫెయిల్యూర్ కావడంతో… ఆసుపత్రి పాలయ్యారు.
Fish

అయితే హైదరాబాదులోని చందానగర్ లో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతి చెందారు ఫిష్ వెంకట్. ఆరోగ్యం మెరుగు పడటానికి… వైద్యులు ఎంతో కృషి చేశారు. కానీ చివరికి ఫిష్ వెంకట్ మృతి చెందాల్సి వచ్చింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.