తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. స్కూల్ విద్యార్థులకు రక్త పరీక్షలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీ లోని చిన్నారులు, ప్రభుత్వ స్కూల్లో ఉండే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు బ్లడ్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం అలాగే బాలికలలో రక్తహీనత పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందని.. అధికారులు చెబుతున్నారు. టెస్టులు అనంతరం వారికి అవసరమైన ఆహారాన్ని అందించి ఆరోగ్యంపై ప్రతినెల గ్రోత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపొందించబోతున్నారు. అంగన్వాడీలలో బ్రేక్ ఫాస్ట్ అందిస్తామని కూడా… తెలంగాణ మహిళా మంత్రి సీతక్క ప్రకటన చేశారు.