నా చావుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కారణం అంటూ నీటిపారుదల శాఖ ఏఈ సూసైడ్ నోట్ కలకలం రేపింది. నా చావుకు EE రంగయ్య, DEE ఉమాశంకర్, ENC శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని సూసైడ్ నోట్ రాశారు.

తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, నిమ్మల రామానాయుడికి లేఖ రాసాడు కిషోర్. ఎన్టీఆర్ జిల్లాలో నీటిపారుదల శాఖ ఏఈ వి.కిషోర్ సూసైడ్ నోట్ కలకలం రేపింది. బదిలీ చేసి రిలీవ్ చేయకుండా.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆదేశాలతో బదిలీ నిలిపివేశారు ఉన్నతాధికారులు.
తన బదిలీని రాజకీయం చేశారంటూ సూసైడ్ నోట్‌లో కిషోర్ ఆవేదన వ్యక్తం చేసాడు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానంటూ సూసైడ్ నోట్ రాసాడు. ఒక దళిత ఉద్యోగిగా తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేసాడు. మరో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో వెల్లడించాడు. ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు ఏఈ వి.కిషోర్. దింతో ఆందోళనలో కిషోర్ కుటుంబసభ్యులు ఉన్నారు.