బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్ !

-

కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని.. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈటెల రాజేందర్. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించానని పేర్కొన్నారు.

etala bandi
etala bandi

2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచినా హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి 53 వేలు మెజారిటీ వచ్చిందని వెల్లడించారు. దింతో బండి సంజయ్ వర్సెస్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్… వార్ హాట్ టాపిక్ అయింది. ఈటెల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ పరోక్షంగా హెచ్చరించారు బండి సంజయ్. నాకు హుజురాబాద్‌లో తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేశారు, వాళ్లకు టికెట్లు ఇవ్వమంటారా..? అంటూ పరోక్షంగా ఈటెల వర్గంపై పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. దింతో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news