vemulawada: వేములవాడ రాజన్న ఆలయానికి రాజ మార్గం త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. 50 ఏళ్లకు పైగా వేములవాడ రాజన్న ఆలయం ముందు ఇరుకు రోడ్లతో భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆలయం వరకు 800 మీటర్ల పొడవు 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించనున్నారు. విస్తరణ కోసం దాదాపు 243 ఇళ్లను కూల్చేశారు.

కొంత మంది కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకోగా వారి ఇళ్ళను మినహాయించి మిగతా ఇళ్లను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా… వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. భక్తులు అధిక సంఖ్యలో వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో కోడె కడితే కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు నమ్ముతారు. గండ దీపంలో నూనెను పోస్తే వారి గండాలు అన్నీ తొలగిపోతాయని ప్రజలు పూర్వకాలం నుంచి విశ్వసిస్తారు.