ఇవాళ నేను సినిమా చేసినా… కోటి రూపాయలపైన ఇస్తారు: రోజా

-

ఈ రోజుకీ నేను సినిమా చేస్తే కోటి రూపాయలపైన ఇస్తారన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఒక్క షో చేస్తే ఒక్క రోజుకి ఎన్ని లక్షలు ఇస్తారో ఆధారాలు ఇస్తానని పేర్కొన్నారు. ఆర్టిస్ట్‌గా సంపాదించుకున్న దాంతో కట్టుకున్న ఇల్లుని దోచుకున్న డబ్బు అని చెప్పడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు.

Gali Bhanu Prakash's controversial comments on Roja
Gali Bhanu Prakash’s controversial comments on Roja

నా హిట్ సినిమాలోని ఒక పాటను ఈవెంట్‌లో పాడితే బూతులా వక్రీకరించారని తెలిపారు ఆర్కే రోజా. నేను అడుగుపెట్టిన ప్రతి షో సూపర్ హిట్ అన్నారు. అగ్ర నటులందరితో సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నా… జగనన్న ఆశీస్సులతో రెండు సార్లు గెలిచి ప్రజలకు చేరువయ్యా అని పేర్కొన్నారు. ప్రజలు నా వెనుక ఉన్నారు కాబట్టే సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నా అని తెలిపారు ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news