ప్రియుడి కోసం.. సాంబారులో విషం కలిపి భర్తను చంపింది ఓ భార్య. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు-ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టికి చెందిన రసూల్(35)కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక ఆ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

భార్య అమ్ముబీకి స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు తొలగించుకోవాలని సాంబారులో విషం కలిపి వడ్డించింది భార్య. తిన్న కొద్దిసేపటికే వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమ్ముబీ వాట్సాప్ చాట్ పరిశీలించగా.. అసలు నిజం బయటపడింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమ్ముబీ, లోకేశ్వరన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు.