ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో జరిగింది? అని నిలదీశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.

ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్‌కు నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాలేదని పేర్కొన్నారు.
దీనికి సంబంధించి సమాచారం ఇవ్వలేదు… రాజ్యసభ నిబంధనల విషయంలో ధన్‌ఖడ్ కఠినంగా వ్యవహరించారన్నారు జైరాం రమేష్.
కాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్… ఈ మేరకు ప్రకటన చేశారు.