సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు డీఎస్సీ మార్కులలో 10% వెయిటేజీ ఇవ్వాలని విద్యాశాఖ ఆలోచనలో ఉంది. KGBV, URS లో పనిచేసే టీచర్లు, CRPలు, ఇతర టీచింగ్ స్టాఫ్ కు దీనిని వర్తింపజేయాలని అనుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ విషయం పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9 వేల మందికి పైగా లబ్ది పొందనున్నారు.