మాంసాహారులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రేపు అలాగే ఎల్లుండి మాంసం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు అలాగే ఎల్లుండి మాంసం దుకాణాలు బందు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఇండిపెండెన్స్ డే అలాగే ఎల్లుండి శ్రీకృష్ణాష్టమి పండుగలు వరుసగా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే హింసకు తావు లేదని అధికారులు వెల్లడించారు. అందుకే… రేపు అలాగే ఎల్లుండి మాంసం దుకాణాలు బందు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ అధికారిక ప్రకటన చేశారు. ఈ రెండు రోజులు పశువుల వదశాలలు అలాగే రిటైల్ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అటు రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది.