ఇంట్లోనే నడుము నొప్పి నివారణకు 5 చిట్కాలు..

-

ప్రస్తుతం ప్రతి 10 మందిలో 8 మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య నడుము నొప్పి. ఇది కండరాల ఒత్తిడి, ఏదైనా గాయాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవిస్తుంది. తీవ్రమైన నొప్పి ఉన్న సందర్భాల్లో వైద్య చికిత్స అవసరం అవుతుంది కానీ సాధారణ నడుము నొప్పికి ఇంట్లోనే తగ్గించుకునే చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.. మరి ఆ చిట్కాలు మనము తెలుసుకుందాం..

వేడి లేదా చల్లని ప్యాక్: నడుము నొప్పిగా ఉన్నప్పుడు, నొప్పి మొదలైన కొద్ది గంటల్లోనే ఐస్ ప్యాక్ ను మెత్తని గుడ్డలో చుట్టి నడుం పై 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయటం వాపు నొప్పిని తగ్గిస్తుంది. కొన్ని గంటల తర్వాత అప్పటికి తగ్గకపోతే గోరువెచ్చని నీటి లో మెత్తటి గుడ్డను ముంచి 15 నిమిషాలు నడుము పై కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల కండరాలు సడలించి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా నొప్పి తగ్గుతుంది. ఐస్ ప్యాక్ వాపుని తగ్గిస్తుంది. వేడి నీటి కాపడం కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. డైరెక్ట్ గా ఐస్ గడ్డను పెట్టడం లేదా డైరెక్ట్ గా వేడి నీళ్లు నడుముపై పోయడం లాంటివి చేయకూడదు ఎల్లప్పుడూ ఒక క్లాత్ ని ఉపయోగించాలి.

అల్లం ఉపయోగం : నడుము నొప్పిగా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ తాజా అల్లం ముక్క నీటిలో వేసి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించి కొద్దిగా తేనె కలిపి రోజు సేవించాలి. ఇలా తాగడం వల్ల అల్లం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పి నివారణ లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే పైన పూతకి తాజా అల్లం పేస్ట్ ని నడుము పై రాసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చ నీటితో కడిగేయాలి. అల్లం పేస్టు అన్ని చర్మాలకు సూట్ కాకపోవచ్చు. మంట అనిపిస్తే వెంటనే కడిగేయండి.

వ్యాయామాలు : ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వ్యాయామాలతో ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నడుం నొప్పి ఉన్నవారు క్యాట్ భంగిమలో కూర్చుని, వీపుని పైకి కిందకి కదిలించడం లాంటి వ్యాయామాలు రోజుకి ఐదు నుంచి పది సార్లు చేయాలి.నేలపై వెళ్ళికల పడుకొని మోకాళ్ళని వంచి నడుమును నేలకు ఆనించి 10 సెకండ్లు పట్టుకోవాలి. ఇలా పదిసార్లు చేయడం వలన నడుము కండరాలు సడలించి రక్త ప్రసరణ మెరుగవుతుంది.

5 Home Remedies to Relieve Back Pain

ఆయిల్ మసాజ్: కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆమదం నూనె, ఏదైనా సరే గోరువెచ్చగా చేసి నడుము పై సున్నితంగా మర్దన చేయాలి. ఇలా రోజు 15 నిమిషాలు చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందవచ్చు.
విశ్రాంతి: మనకు ఉన్న పని భారం లేదా ఏదైనా సమస్యల వల్ల సరిగా నిద్రపోకపోయినా, నడుము నొప్పి వస్తుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు వీపు నిటారుగా ఉంచడం నడుముకి సపోర్టుగా కుషన్స్ ని ఉపయోగించడం చేయాలి. రోజుకి 6 నుంచి 8 గంటలు మంచి నిద్ర పోవడం ఎంతో ముఖ్యం.

నొప్పి తీవ్రంగా ఉంటే జ్వరం కాళ్లలో తిమ్మిరి బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ఆరోగ్యకరమైన జీవన శైలి క్రమం తప్పకుండా వ్యాయామం సరైన నిద్ర సాధారణ నడుము నొప్పిని నివారించవచ్చు.

(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.)

Read more RELATED
Recommended to you

Latest news