హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలో కృష్ణాష్టమి ఒకటి. గోకులాష్టమి,శ్రీ కృష్ణ జన్మాష్టమి అనే పేర్లతో పిలవబడే ఈ పండుగా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధ లతో జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా భక్తులు ఆనందంతో పూజలు వ్రతాలు, ఉపవాసాలు ఆచరిస్తారు. శ్రీకృష్ణాష్టమి పూజను భక్తితో నిర్వహిస్తే శాంతి, సంపద, సుఖం, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయని నమ్ముతారు. మరి ఆ పూజా విధానం దాని ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కృష్ణాష్టమి ప్రాముఖ్యత: కృష్ణాష్టమి శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి తిధినాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవుని కుమారుడిగా జన్మించిన రోజును సూచిస్తుంది. ఈరోజు భక్తులు శ్రీకృష్ణుని లీలలను స్మరించుకుంటూ ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తారు. ఈ పండుగ దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించిన శ్రీకృష్ణుని దివ్య లీలను జ్ఞాపకం చేస్తోంది. ఈ పండుగ రోజు పూజలు చేయటం కుటుంబం సంక్షేమం శాంతి, ఆనందం, సుఖం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
కృష్ణాష్టమి పూజా విధానం : ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి పూజా స్థలాన్ని పవిత్రంగా ఉంచి, పూలతో అలంకరించాలి. పూజ కోసం శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం, పుష్పాలు, తులసి ఆకులు గంధం అగరుబత్తి, దీపం, నీరు, నైవేద్యం కోసం వెన్న, పండ్లు అటుకులు సిద్ధం చేయాలి.ఈ రోజున భక్తులు ఉపవాసం ఆచరిస్తారు కొందరు పూర్తి ఉపవాసం, కొందరు పండ్లు, పాలు సాత్విక ఆహారం తీసుకుంటారు. ఉపవాసం మనసుని శుద్ధి చేస్తుంది.

పూజా కార్యక్రమం: పూజ ప్రారంభించే ముందు శ్రీకృష్ణుని ఆశీస్సులు కోసం సంకల్పం చేయాలి. శాంతి సంపద, ఆరోగ్యం, సుఖం, కోసం ఈ పూజను ఆచరిస్తున్నాను అని మనసులో సంకల్పించుకోవాలి. శ్రీకృష్ణుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసి పీఠంపై ఉంచాలి. పూలతో అలంకరించి తులసి ఆకులను, నెమలి పింఛం, సమర్పించాలి. ముందుగా గణపతి పూజను గావించి, ఆ తరువాత శ్రీకృష్ణుని పూజ చేసుకొని, దూపం,దీపం, హారతి ఇవ్వాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా హరే కృష్ణ హరే కృష్ణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా పూజ గావించిన తరువాత శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్నె,మిఠాయిలు పండ్లు, లడ్లు, పాలు, అటుకులు సమర్పించాలి. ఒక పూట భోజనం చేసి మరల సాయంత్రం తులసీదళాలు సమర్పించి పాలు పండ్లు, నైవేద్యం పెట్టి స్వామికి హారతి ఇవ్వవలెను ఇలా పూజ ను ముగించవచ్చు.
జాగర్తలు: ఈరోజు పూజా సమయంలో శుచిగా ఉండడం, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం, ఉపవాసం ఆచరించే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం అంటే నివారించడం పూజను భక్తితో శ్రద్ధతో చేయడం వలన శ్రీకృష్ణుని కృప లభిస్తుంది. ఇక్కడ ఆడంబరం కంటే భక్తి ముఖ్యం. ఈ సంవత్సరం ఆగస్టు 16 ‘శ్రీ కృష్ణాష్టమి’ సందర్భంగా భక్తితో పూజ చేసి శ్రీకృష్ణుని కృపను పొందండి.