జూ.ఎన్టీఆర్ ను నేను తిట్టలేదన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. నేనంటే గిట్టని వారే ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారన్నారు. నారా, నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం అని పేర్కొన్నారు. జూ.ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలని వీడియో విడుదల చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.
ఈ వీడియో, ఆడియోలు నావి కావు… దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు దగ్గుబాటి ప్రసాద్. కాగా, అటు నిన్న జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అవమానించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో బయటకు వచ్చింది.
జూ.ఎన్టీఆర్ ను నేను తిట్టలేదు: దగ్గుబాటి ప్రసాద్
నేనంటే గిట్టని వారే ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు
నారా, నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం
జూ.ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి
ఈ వీడియో, ఆడియోలు నావి కావు
దీనిపై గట్టి చర్యలు… https://t.co/FIg0dmuBCF pic.twitter.com/94xPuunN85
— BIG TV Breaking News (@bigtvtelugu) August 17, 2025