ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 28వ తేదీన తిరుమల శ్రీవారి సన్నిధికి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. వైయస్ భారతి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై వైసీపీ అధికార సోషల్ మీడియా స్పందించింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి… తిరుమల పర్యటనకు వెళ్లడం లేదని.. అదంతా ఫేక్ ప్రచారమని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ తిరుమల పర్యటనకు వెళ్ళేది ఉంటే అధికారిక సోషల్ మీడియా ద్వారా.. సమాచారం ఇస్తామని వివరణ ఇచ్చింది వైసిపి సోషల్ మీడియా. ఇక అటు ఇవాళ వైసిపి నేతలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి లోని కార్యాలయంలో.. వైసిపి కీలక నేతలతో సమావేశం అవుతారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ పరిస్థితులపై.. అలాగే కూటమి వైఫల్యాలపై చర్చించనున్నారు.
🚨 Fake Alert 👇
ఈ నెల 28న తిరుమలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనేది పూర్తిగా అవాస్తవం..
జగన్ గారి పర్యటన వివరాలు ఏవైనా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ప్రకటించడం జరుగుతుంది.#FakeAlert #YSRCP #JaganannaConnects pic.twitter.com/AZ3LHvywUv
— Jagananna Connects (@JaganannaCNCTS) August 25, 2025