హైదరాబాద్ లో పెను ప్రమాదం నెలకొంది. కల్వర్టులోకి దూసుకెల్లింది బస్సు. కుత్బుల్లాపూర్-జీడిమెట్ల పీఎస్ పరిధిలో RDPL కంపెనీ కాజిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెల్లింది బస్సు.

ఈ ప్రమాదంలో బైకర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్‌కి తరలించారు. షాపూర్‌నగర్ ఆదర్శ్ బ్యాంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్నారు పోలీసులు. ఇక ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించిన వీడియో వైరల్ గా మారింది.
కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు
కుత్బుల్లాపూర్-జీడిమెట్ల పీఎస్ పరిధిలో RDPL కంపెనీ కాజిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం
రోడ్డుపై వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు
బైకర్ తలకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్‌కి తరలింపు… pic.twitter.com/SBsEcixvyR
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2025