కామారెడ్డిలో అధికారుల నిర్లక్ష్యం.. 20 కి.మీ ట్రాఫిక్ జామ్

-

కామారెడ్డి లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా .. 20 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. కామారెడ్డి జిల్లాలో NH44 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రహదారిపై వరద నీరు నిల్వలేనప్పటికీ, ట్రాఫిక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 కి.మీ మేర నిలిచిపోయాయి వాహనాలు.

Heavy traffic jam on NH44 national highway in Kamareddy district
Heavy traffic jam on NH44 national highway in Kamareddy district

దింతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కొన్ని ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వాగులను తలపించేలా రహదారులపై వర్షపు నీరు ప్రవాహం ఉంది. దింతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news