Nivetha Pethuraj: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేత పేతురేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్సేన్ నటించిన చాలా సినిమాలలో నివేత పేతురేజ్ మెరిశారు. అయితే అలాంటి హీరోయిన్ నివేత పేతురేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ మేరకు స్వయంగా హీరోయిన్ నివేత పేతురేజ్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.

ఆమె ప్రముఖ బిజినెస్ మాన్ రాజహిత్ ఇబ్రాన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు హీరోయిన్ నివేత పేతురేజ్. ఇందులో భాగంగానే తన కాబోయే భర్తకు టైట్ హాగ్ ఇచ్చిన ఫోటోను రివిల్ చేశారు. ఇకపై జీవితం ప్రేమతో నిండి ఉంటుంది అనే క్యాప్షన్ తో కూడిన ఫోటోను షేర్ చేశారు. అయితే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.