శ్రీశైలం ప్రాజెక్టుకు వరద..పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు 10 అడుగులు మేర పైకెత్తి నీటి విడుదల చేసారు. స్పిల్ వే నుంచి 2,69,280 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల, నుంచి శ్రీశైలానికి 1,61,414 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉంది.

శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులు నమోదు అయింది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రస్తుత నీటినిల్వ 202.0439 టీఎంసీలుగా ఉంది. కుడి , ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విద్యుదుత్పత్తి చేసి 62,067 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు.