సామాన్యులకు అదిరిపోయే శుభవార్త. గ్యాస్ సిలిండర్లు తగ్గాయి. ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే… గ్యాస్ సిలిండర్ల ధర మారుతూ ఉంటుంది. ఒక నెల పెరగవచ్చు లేదా ఒక నెల తగ్గవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా సిలిండర్ ధర క్రమక్రమంగా తగ్గుతోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే ఇవాళ కూడా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు వెల్లడించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై 51. 50 రూపాయలు తగ్గించడంతో ఢిల్లీలో సిలిండర్ ధర 1580 రూపాయలు తగ్గింది. దీంతో హోటల్లు రెస్టారెంట్లు ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట కలగనుంది. ఇక గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.