*ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవల విస్తరణ*
*త్వరలోనే 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి*
*ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు*
*టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్*
*ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం*
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇస్తామని తాజాగా వెల్లడించారు. ఐటీ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనర్. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయని వివరించారు. అతి త్వరలోనే 20075 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని కూడా వివరణ ఇచ్చారు.

ఐటీ ఉద్యోగులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు… తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతోపాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని… ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ప్రైవేట్ వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఈ సందర్భంగా అస్పష్టం చేశారు. ప్రజా రవాణాను వినియోగించుకోవాలని కోరారు.