నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలతో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా… తాజాగా కృతి సనన్ సినీ పరిశ్రమ గురించి హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినన్ని సౌకర్యాలను హీరోయిన్లకు ఇవ్వడం లేదని కృతి సనన్ ఫైర్ అయ్యారు.

హీరోలు షూటింగ్ కు లేటుగా వస్తారని… హీరోయిన్లను టైమ్ కన్నా ముందే రావాలని చెబుతారు. లింగ వివక్ష చూపకుండా అందరికీ సమానమైన గౌరవం ఇవ్వాలని కృతి సనన్ కోరుతున్నారు. ప్రొడ్యూసర్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇండియా ఆమెను జెండర్ క్వాలిటీ అంబాసిడర్ గా నియమించడం విశేషం. కాగా ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.