బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. ఈ బాలాపూర్ గణేష్ వేలం పాటలో రూ.35 లక్షలకు లడ్డుని దక్కించుకున్నారు లింగాల దశరథ్ గౌడ్. దీంతో గత ఏడాది కంటే రూ.5 లక్షలు బాలాపూర్ లడ్డు ధర పెరిగింది. ఈ తరుణంలోనే… ఈ ఏడాది బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది.

లింగాల దశరథ్ గౌడ్ కర్మన్‌ఘాట్‌కు చెందిన వారు. కాగా, ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే సంప్రదాయ మేళతాళాలతో ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ముందుగా గణేశునికి ఉత్సవ కమిటీ భారీ గజమాలను వేసింది. నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు.
- రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు
- వేలం పాటలో రూ.35 లక్షలకు లడ్డుని దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్
- గత ఏడాది కంటే రూ.5 లక్షలు పెరిగిన బాలాపూర్ లడ్డు