టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తో అక్కినేని హీరో సుశాంత్ అడ్డంగా దొరికిపోయాడు. మీనాక్షి చౌదరి అలాగే అక్కినేని హీరో సుశాంత్ ఇద్దరు విమానాశ్రయంలో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా కోర్టు వేసుకున్న సుశాంత్… బ్యాగ్ పట్టుకుని నడుస్తున్నాడు. అటు హీరోయిన్ మీనాక్షి చౌదరి… ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎంట్రీ ఇచ్చారు.

వీళ్ళిద్దరి ఫోటోలు బయటకు రావడంతో… సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు సీక్రెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారని… అందుకే వెకేషన్ వెళ్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే… ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయం నుంచి ప్రేమాయణం మొదలైందని అంటున్నారు.