ఉగ్రరూపం దాల్చిన కృష్ణా నది.. శివుని కంఠాన్ని తాకుతూ ప్రవహిస్తున్న నీరు

-

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. నీలకంఠుడికి కృష్ణమ్మ జలాభిషేకం జ‌రిగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కాట్రపాడులోని కృష్ణా నది ఒడ్డున ఉన్న శివయ్య విగ్రహానికి వరద నీరు తాకుతూ జలాభిషేకం చేస్తున్న అపురూప దృశ్యం వైర‌ల్ అవుతోంది.

The raging Krishna River the water flowing touching the throat of Lord Shiva
The raging Krishna River the water flowing touching the throat of Lord Shiva

కృష్ణా నదిలో వరద పెరగడంతో నీరు శివుడి కంఠాన్ని తాకుతున్నట్లు ప్రవహించడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తుల దర్శనార్థం ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news