ఈ రోజుల్లో ఎక్కువమంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గాలని లేదా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారు చాలామంది రాత్రిపూట అన్నం తినడం మానేసి దానికి బదులుగా అల్పాహారం తింటూ ఉంటారు. అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని, టిఫిన్ తింటే తేలిగ్గా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ అలవాటు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ అలవాటు మంచిది కావచ్చు. కానీ మరి కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హానికరంగా మారొచ్చు. మరి ఈ అలవాటు వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
అన్నం లేదా టిఫిన్: అన్నం వర్సెస్ టిఫిన్ పోషకాల వ్యత్యాసం గురించి మనం తెలుసుకుంటే అన్నం (తెల్ల బియ్యం) ప్రధానంగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై శరీరానికి శక్తిని ఇస్తుంది అయితే ఇందులో ఫైబర్ ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. మరోవైపు టిఫిన్ ఇడ్లీ, దోశ, చపాతి లాంటివి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. కానీ అవి సాధారణంగా పప్పులు, గోధుమలతో తయారుచేయబడతాయి. ఉదాహరణకి ఇడ్లీలో ప్రోటీన్ చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
రాత్రిపూట టిఫిన్ వల్ల లాభాలు : తేలికగా తినాలి అని అనుకునేవారు ఎక్కువగా రాత్రిపూట టిఫిన్ చేస్తారు., ఇడ్లీ చపాతీ లాంటివి అన్నం కంటే తేలిగ్గా జీర్ణం అవుతాయి. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే వారికి ఇది మంచి ఎన్నిక అవుతుంది. అన్నం కన్నా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే టిఫిన్ ఐటమ్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే దీనికి మీరు ఎంత పరిమాణంలో తింటున్నారు అనేది ముఖ్యం. అన్నం మానేసాం కదా అని టిఫిన్ ని నాలుగు రకాలు చేసుకొని తింటే బరువు నియంత్రణలో ఉండదు.

నైట్ టిఫిన్ వల్ల నష్టాలు: సరిపడా పోషకాలు అందకపోవడం, అన్నం మానేసి కేవలం టిఫిన్ తినడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్ అందకపోవచ్చు. చాలామంది బ్యాలెన్స్ ఆహారం తీసుకోకుండా కేవలం టిఫిన్ తిని ఆకలి తీర్చుకుంటారు. దీనివల్ల పోషకాహారం లోపం ఏర్పడుతుంది టిఫిన్ తో పాటు కూరగాయలు, పప్పులు తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు. అలాగే అధిక కేలరీలు కలిగిన దోస, పూరి వంటివి నూనెలో వేయిస్తారు. వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి రాత్రిపూట తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు.
రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినే అలవాటు మంచిది అయినా అది మీరు ఎంచుకునే టిఫిన్ రకాన్ని పరిమాణాన్ని బట్టి ఉంటుంది. తక్కువ నూనెతో చేసిన త్వరగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చపాతీ వంటి వేయించుకోవడం మంచిదే అలాగే కేవలం టిఫిన్ మాత్రమే కాకుండా దానితో పాటు కూరగాయలు పప్పులతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాలు మారుతాయి. మీరు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అనుకునే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.