బాలికల హాస్టల్‌లోకి బీరు బాటిల్‌తో వ్యక్తి..!

-

బాలికల హాస్టల్‌లోకి బీరు బాటిల్‌తో వ్యక్తి రావ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో బాలికల హాస్టల్ ముందే తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ మండలం పెంబర్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలోకి బీర్ బాటిల్‌తో ప్రవేశించారు ఓ వ్యక్తి.

Man enters girls' hostel with beer bottle
Man enters girls’ hostel with beer bottle

ప్రైవేట్ వ్యక్తి లోపలికి వెళ్లడాన్ని చూసి గేటు ముందే అడ్డుకున్నారు తల్లిదండ్రులు. బాలికల హాస్టల్‌లోకి బీరు బాటిల్‌తో ప్రవేశించడంతో పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరుగుతోందంటూ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘ‌ట‌న పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news