టాలీవుడ్ నటి, మోడల్ రంగ సుధాకు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ నటి, మోడల్ రంగ సుధాపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. రంగ సుధా చేసిన ఫిర్యాదు ప్రకారం –రాధాకృష్ణ అనే వ్యక్తి, అలాగే కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని రాధాకృష్ణ గతంలోనే తనను బెదిరించాడని కూడా ఫిర్యాదులో వివరించారు.

ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై IPC 354D (stalking), 509 (insult to modesty of woman), 506 (criminal intimidation), అలాగే IT Act సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు సోషల్ మీడియా పోస్టులు, ఖాతాలను పరిశీలిస్తూ, సాక్ష్యాలను సేకరిస్తున్నారు.