కవితను టీడీపీలో తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్టే – నారా లోకేష్‌

-

ఏపీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కల్వకుంట్ల కవితను టీడీపీలో తీసుకోవడమంటే వైఎస్ జగన్‌ను చేర్చుకున్నట్టే అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘కేటీఆర్‌ను కలవాలంటే.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా?’ అంటూ చుర‌క‌లు అంటించారు నారా లోకేష్‌. కొన్నాళ్ల క్రితం కేటీఆర్, లోకేష్ కలిశారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

nara lokesh,kavitha
nara lokesh kavitha

చిట్ చాట్ లో నారా లోకేష్ మాట్లాడుతూ…. వివిధ సందర్భాల్లో తాను కేటీఆర్‌ని కలిశానని.. ఎందుకు కలవకూడదంటూ లోకేష్ తిరుగు ప్ర‌శ్నించారు. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్ రెడ్డిని అడగాలా? అంటూ సీఎం గాలి తీసిపారేశారు నారా లోకేష్. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబడ్డ కవితను తమ టీడీపీలో చేర్చుకోవడం లేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ను చేర్చుకున్నట్టేనంటూ నారా లోకేష్ కుండబద్దలు నారా లోకేష్. దీంతో నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news