తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని హనుమకొండ, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, వర్గల్, భువనగిరి జిల్లాల్లో ఈరోజు నుంచి మరో వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.

వర్షంతో పాటు పెద్ద పెద్ద పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షం కురిసే సమయంలో ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత వాసులు వీలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.