దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో కొత్త అధ్యయనం రాబోతుంది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన లావాదేవీలు మాత్రమే చేసేవారు. ఇకపై భారీ మొత్తాలు కూడా చేసుకోవచ్చు. రోజుకు లక్ష రూపాయలు వరకు ఒక అకౌంట్ ద్వారా డబ్బులు పంపించుకునే ఛాన్స్ ఉండేది.

అయితే ఇప్పుడు ఆ లిమిట్ 10 లక్షల వరకు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది యూపీ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ లిమిట్ పెరిగే ఛాన్స్ ఉంది.
కొత్త లిమిట్స్ వివరాలు
- క్యాపిటల్ మార్కెట్స్ & ఇన్వెస్ట్మెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజుకి రూ. 10 లక్షలు
- ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజుకి రూ. 10 లక్షలు
- ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM): ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజుకి రూ. 10 లక్షలు
- ట్రావెల్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజుకి రూ. 10 లక్షలు
- క్రెడిట్ కార్డ్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజుకి రూ. 6 లక్షలు
- బిజినెస్/మర్చంట్ పేమెంట్స్: ఒక్కో ట్రాన్సాక్షన్ రూ. 5 లక్షలు – రోజువారీ లిమిట్ లేదు