టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు అయ్యారు. కొద్దిసేపటి క్రితమే లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయం కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్ నుంచి వెంటనే ఆసుపత్రికి వెళ్లి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంటకు శుభాకాంక్షలు చెప్పి తన మనవడిని చూసినట్టుగా తెలుస్తోంది. కాగా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటకు 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు పూర్తిగా దూరమైంది. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. ఇక ఇప్పుడు పండంటి మగ బిడ్డకు లావణ్య త్రిపాఠి జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారట. మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.