కోలీవుడ్ హీరో అశోక్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను కోలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం “వడ మంజువిరట్టు”. ఈ సినిమా షూటింగ్ లో జల్లికట్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో హీరోపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో హీరో అశోక్ గాయాల పాలయ్యారు. ఎద్దు దాడి చేయడంతో అశోక్ పక్కటెముకల వద్ద గాయం అయింది.

హీరోతో పాటు చాలా మంది షూటింగ్ సమయంలో అక్కడ ఉన్నారు. కానీ వారెవరికి గాయాలు కాలేవు. దీంతో వెంటనే చిత్ర బృంద సభ్యులు అశోక్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స నిమిత్తం అశోక్ యధావిధిగా సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. జల్లికట్టు సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్రుటిలో అశోక్ కు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఎద్దు దాడిలో ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయారని… ఎద్దు కొమ్ములు బలంగా కడుపులో తాకినట్లయితే ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు.