ఏపీలో టమాటా, ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. వర్షాల కారణంగా టమాటా, ఉల్లి కుళ్ళిపోతుందని వీటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో టమాటా, ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాట కేవలం 2 రూపాయలకు పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో టమాటా ధర 3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పలికింది. మరోవైపు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా కేవలం 150 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో రైతులు వారికి కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని నిరాశపడుతున్నారు. ప్రభుత్వం తరఫున వారికి న్యాయం జరగాలని వేడుకుంటున్నారు. వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాలలో రైతులు వీటి ధర విపరీతంగా పడిపోవడంతో టమాటాను రోడ్ల పైన పారేస్తున్నారు. కొంతమంది రైతులు టమాటా చెట్లనుంచి తీయడానికి కూలి ఖర్చులు దండగ అని అలానే వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన స్పందించి రైతులకు తగిన న్యాయం చేస్తుందో లేదో చూడాలి.