మహాభారతంలో ధర్మరాజుగా పేరుగాంచిన యుధిష్ఠిరుడు సత్యానికి, ధర్మానికి ప్రతిరూపం. ఆయన జీవితం మనకు సత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. యుధిష్ఠిరుడు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాలును సత్యం అనే ఆయుధంతోనే అధిగమించాడు. ఈ కథలు మనకు సత్యం ఎంత శక్తివంతమైనదో, అది మనల్ని ఎలా కాపాడుతుందో చూపిస్తాయి. ముఖ్యంగా ఈ తరం యువతకు, ఇది ఒక గొప్ప స్ఫూర్తి.
యుధిష్ఠిరుడు జీవితంలో సత్యం పాటించి, అందరి చేత గౌరవించబడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు చెబుతున్నారు. కానీ అబద్ధం వల్ల కలిగే లాభం క్షణికం మాత్రమే. చివరికి అబద్ధం మనల్ని బాధల్లోకి నెట్టేస్తుంది.
ఒకసారి పాండవులు స్వర్గానికి వెళ్లేటప్పుడు, యుధిష్ఠిరుడు తనతో పాటు వచ్చిన ఒక శునకాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరించాడు. దేవతలను కూడా ధిక్కరించి, సత్యం, కరుణతో నిలబడ్డాడు. ఆ కుక్క స్వయంగా ధర్మదేవత. యుధిష్ఠిరుడి సత్యనిష్ఠ, కరుణను పరీక్షించడానికి ఈ సంఘటన జరిగింది. చివరకు ఆయన నరకానికి వెళ్లి తన సోదరులు ఉన్నారని తెలుసుకుని, వారితో కలిసి ఉండటానికి సిద్ధపడ్డాడు. ఈ సంఘటనల ద్వారా ఆయన సత్యంపై ఉన్న విశ్వాసం, ధర్మానికి కట్టుబడి ఉండటం ఎంత గొప్పదో తెలుస్తుంది.

కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడిని ఓడించడానికి ఒక పథకం వేశారు. అది అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని యుధిష్ఠిరుడు చెప్పాలి. ఎందుకంటే యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పడని ద్రోణుడు నమ్మేవాడు. యుధిష్ఠిరుడు “అశ్వత్థామ హతః కుంజరః” (అశ్వత్థామ చనిపోయాడు, అది ఏనుగు) అని చెప్పాడు. చివర్లో కుంజరః (ఏనుగు) అనే పదం నెమ్మదిగా చెప్పడం వల్ల ద్రోణుడు దాన్ని వినలేకపోయాడు. ఈ ఒక్క చిన్న అసత్యం యుధిష్ఠిరుడి నరకాన్ని చుసుడటానికి కారణమైంది. ఇది సత్యానికి ఎంత శక్తి ఉందో అబద్ధం చెప్పడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూపిస్తుంది.
యుధిష్ఠిరుడు చెప్పిన సత్యం యొక్క గొప్పతనం ఈ తరానికి కూడా ఒక గొప్ప పాఠం. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సత్యాన్ని వదిలిపెట్టకూడదు. సత్యం ఒక శక్తి. అది మనల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ఏ సమస్య వచ్చినా నిజాయితీగా, సత్యంగా ఉంటే మనకు తప్పకుండా విజయం వస్తుంది.
సత్యం మార్గంలో నడవండి. అబద్ధాలకు దూరంగా ఉండండి. మీ జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటుంది. ఇది యుధిష్ఠిరుడి నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం.