ఏపీలో బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు మహిళలు. ఉచిత బస్సు పథకం అమలు చేసినప్పటి నుంచి ఏపీలోకి ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో ఇలాంటి సంఘటన బయటకు వస్తోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో
సీటు విషయంలో ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

వాగ్వాదం పెరిగి ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు మహిళలు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను వైసీపీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటోంది. ఇటీవలే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
బస్సు సీటు కోసం మహిళల కొట్లాట
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో సీటు విషయంలో ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం.. అది పెరిగి ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న మహిళలు pic.twitter.com/OcR5AREjsm
— greatandhra (@greatandhranews) September 14, 2025