ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజ్ అయిన లేఖపై ప్రజా సంఘాలు అనేకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా సంతకం, ఫోటోతో ఎలాంటి లేఖలు రిలీజ్ కాలేదు. ఆగస్టు 15వ తేదీ అని ఇందులో రాసి ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామని ప్రకటన ఇంత సులభంగా అసలు ఉండదు.

దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపుగా ఈ లేఖను వెరిఫై చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా…. నిన్న ఈ మావోయిస్టులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. మేము లొంగిపోతాం, మా మీద కాల్పులు ఆపేయండి, ఎన్కౌంటర్లు చేయకండి ఈ విషయం పైన ఆలోచించి నిర్ణయం తీసుకోండి మేము జనజీవన స్రవంతిలో కలుస్తామని మావోయిస్టులు లేఖ రాశారు. ఈ విషయంపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ చర్చలకు వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.