ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ సంచ‌ల‌న ట్వీట్ !

-

ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రాసిన ఆర్టిక‌ల్ పై స్పందించారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు.

Komatireddy Rajagopal's emotional tweet on Andhra Jyothi magazine
Komatireddy Rajagopal’s emotional tweet on Andhra Jyothi magazine

మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news