పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం అన్నారు. ఉల్లి రైతుల ఉసురు తగలకపోదు.

రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిదే అంటూ ఆగ్రహించారు. ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమే. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే..మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా ? క్వింటాకు 50 రూపాయలా ? అని ప్రశ్నించారు.
ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ? ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది ? అని నిలదీశారు. ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ డబ్బా కొట్టడం కాదు. ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టండని కోరారు.