తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్‌పై నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. డ్రోన్లు ఎగరవేసి, గత ప్రభుత్వ కేసీఆర్ గుర్తులు అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆంక్షలు పెట్టారని అంటున్నారు. సెక్రటేరియట్ చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సెక్రటేరియట్‌పై, చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా చిట్ చాట్ లో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వెల్లడించారు రేవంత్ రెడ్డి.
నేను కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఎంతో మందికి కండువాలు కప్పాను… ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కవితను బయటకు వెళ్లగొట్టారని ఆరోపణలు చేశారు.