ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఈ ముగ్గురు టీడీపీలో చేరనున్నారట.

ఈ ముగ్గురు ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ చేరికతో టీడీపీ శక్తి మరింత పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘ఛలో మెడికల్ కాలేజీ’ నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘ఛలో మెడికల్ కాలేజీ’ చేపట్టారు.