సామాన్య ప్రజలకు అదిరిపోయే సువార్త చెప్పాయి విజయ అలాగే సంగం డెయిరీలు. జీఎస్టీ లో సమూల మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో…. తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం అలాగే విజయ డెయిరీలు తాజాగా ప్రకటన చేశాయి. సంగం డెయిరీ… UHT పాలు లీటర్ పై రెండు రూపాయలు అలాగే పన్నీరుపై కిలో 15 రూపాయలు తగ్గించారు.

అలాగే నెయ్యి- వెన్నపైన మొత్తం 30 రూపాయలు తగ్గించింది. ముఖ్యంగా బేకరీలో లభించే పాల పదార్థాలపై 20 రూపాయలు తగ్గించారు. అటు విజయ డెయిరీ టెట్రా పాలు లీటరుకు ఐదు రూపాయలు తగ్గాయి. ఫ్లేవర్డ్ మిల్క్ లీటర్ కు ఐదు రూపాయలు అలాగే పన్నీరుపై కిలో 20 రూపాయలు తగ్గింది. వెన్న అలాగే నెయ్యిపై… 30 రూపాయలు తగ్గనున్నా యి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.