దసరా వేళ ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఉపాధ్యాయుల కోరిక మేరకు మరో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

అయితే… తాజాగా మార్పు చేయడంతో ఏపీలో మరో రెండు రోజులు అదనంగా సెలవులు లభించనున్నాయి. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు సెలవుల పొడిగింపు విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు నారా లోకేశ్. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.