రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ మాంసం అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఇవాళ మహాలయ అమావాస్య అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. పితృదేవతలకు తర్పణాలు వదిలితే మేలు జరుగుతుందని పండితులు సూచనలు చేస్తున్నారు. కుదిరితే ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలని ఈ సూచనలు చేస్తున్నారు.

అన్నదానం, వస్త్ర దానం ఇవ్వాళ చేస్తే మంచిదని చెబుతున్నారు. కాకులు అలాగే ఆవులకు అదే సమయంలో చీమలకు ఆహారం పెట్టాలని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ అలాగే మాంసానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అలాగే కొత్త వస్తువులు కొనడం లాంటివి అస్సలు చేయకూడదని సూచనలు చేస్తున్నారు పండితులు.