హిందూ పురాణాల్లో శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉండే ఆదిశేషుడిని, దేవతల రక్షకుడైన వాసుకిని ఏడు తలల పాములుగా పూజిస్తాం. అయితే అలాంటి బహుశిరస్సుల సర్పం నిజ జీవితంలో కనిపిస్తుందని ఎప్పుడైనా ఊహించారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోవడం సహజం. ఇటీవల జరిగిన ఒక సంఘటన, పురాణాలలోని సర్పాల ఉనికిని నిజం చేస్తూ, ఎంతోమందిని విస్మయానికి గురి చేసింది. ఆ అరుదైన దృశ్యం వెనుక ఉన్న వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
నిజ జీవితంలో ఏడు తలల పాము కనిపించడం అనేది చాలా అరుదైన విషయం అయితే కర్ణాటకలోని ఒక గ్రామంలో ఏడు తలలు ఉన్నట్టుగా భావించిన ఒక పాము కుబుసం కనిపించడంతో స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరుకు సమీపంలోని కనకపుర గ్రామంలో జరిగింది. స్థానిక గుడి పక్కన ఈ కుబుసం దొరకడంతో, ఇది దైవశక్తిగా శుభ సంకేతంగా భావించిన గ్రామస్తులు దాని చుట్టూ గుమిగూడి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ కుబుసం యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ అద్భుతాన్ని చూడటానికి తరలివచ్చారు.

అయితే, సర్పాల నిపుణుల ప్రకారం, ఏడు తలల పాములు నిజంగా ఉండటం అనేది దాదాపు అసాధ్యం. పాముల్లో రెండు తలలు ఉండే కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే ఒక పాము చర్మం ఒలిచే క్రమంలో లేదా ఇతర కారణాల వల్ల దాని తల భాగం విడిపోయి, ఏడు తలల ఆకారాన్ని పోలి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ప్రజలలోని భక్తిని, పురాణాలపై ఉన్న నమ్మకాన్ని పెంచడంతో పాటు అంతుచిక్కని ప్రకృతి అద్భుతాలపై చర్చకు దారి తీస్తున్నాయి అనటం లో సందేహం లేదు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, పురాణాల కథనాలు, వాస్తవ జీవశాస్త్రం వేర్వేరు అంశాలు.
