గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీవీ (NTV) అధినేత నరేంద్ర చౌదరి గురించి రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన బ్యాంకాక్ వెళ్లారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆయన ఎక్కడికీ వెళ్లలేదని నిక్షేపంగా తన కార్యాలయంలోనే ఉంటూ నిత్యం విధుల్లో నిమగ్నమై ఉన్నారని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, ఆయనతో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు రావడంతో ఈ పుకార్లకు తెరపడింది.
ఉద్యోగుల పక్షపాతి: ఆస్తులైనా అమ్ముతాను కానీ జీతాలు ఆపను అనేది చౌదరి గారు స్వయంగా అన్నమాటలు. అసలు నరేంద్ర చౌదరి గారి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే, ఆయన ఎంతటి ఉద్యోగ పక్షపాతి అనేది స్పష్టమవుతుంది. గతంలో 2014-19 మధ్య కాలంలో ‘నోటుకు ఓటు’ వివాదం నేపథ్యంలో ఏపీలో ఛానల్ ప్రసారాలపై నిషేధం విధించినప్పుడు ఆదాయం భారీగా పడిపోయింది.
ఆ క్లిష్ట సమయంలోనూ “నా ఆస్తులనైనా అమ్ముతాను కానీ, ఉద్యోగుల జీతాలు తగ్గించను, వారిని ఇబ్బంది పెట్టను” అని ఆయన అన్న మాటలు ఆయన నిబద్ధతకు నిదర్శనం. నేటికీ ఎన్టీవీలో 30వ తేదీ రాగానే జీతాలు అందరికి అందుతున్నాయి.అలాంటి కఠిన నిమయం అక్కడ ఉంది. ఆయన విదేశాల్లో ఉన్నా సరే, ఉద్యోగుల వేతనాల విషయంలో ఆలస్యం అవ్వదు అన్నది యాజమాన్య వర్గాలు చెబుతున్న మాట.
ప్రజాస్వామ్య విలువలు: ఎన్టీవీ వ్యవస్థలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. నరేంద్ర చౌదరి గారు స్వతహాగా జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ, వృత్తిపరమైన నిర్ణయాల్లో ఎప్పుడూ సొంత నిర్ణయాలు రుద్దరు. సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

జర్నలిస్టులకు స్వేచ్ఛ: వార్తల ఎంపికలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోరు. “మీరు జర్నలిస్టులు, మీకే ఎక్కువ తెలుస్తుంది” అని నమ్ముతూ వారికి పూర్తి స్వేచ్ఛనిస్తారు.
నిష్పక్షపాత వైఖరి: ప్రభుత్వాలు మారినా, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా వార్తల ప్రవాహాన్ని ఆపడానికి ఆయన ఇష్టపడరు. మీడియా అంటే పూల బాట కాదు, రాళ్ల దెబ్బలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నదే ఆయన సిద్ధాంతం. నష్టం తెలిసినా.. వెనకడుగు వేయని తత్వం ప్రభుత్వాల ఆగ్రహం వల్ల ప్రకటనలు రాకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా ఆయన తన పంథా మార్చుకోవడం లేదు. అయన
“మీరు జర్నలిస్టులు, మీ పని మీరు చేయండి” అని తన టీమ్‌కు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే కొన్నిసార్లు వివాదాస్పద వార్తలు కూడా బయటకు వస్తుంటాయి. అది ఆయనకు తెలియక జరిగినవి కావచ్చు లేదా జర్నలిస్టుల నిర్ణయాలను గౌరవించడం వల్ల కావచ్చు, కానీ అల్టిమేట్‌గా ఆయన మాత్రం ‘వార్త’ గొంతు నొక్కడానికి సిద్ధంగా లేరు.
ఆధ్యాత్మిక, సామాజిక సేవలో అగ్రగామి: న్యూస్ ఛానల్‌తో పాటు మహిళల కోసం ‘వనిత’ టీవీ ఆధ్యాత్మిక రంగంలో ‘భక్తి టీవీ’ని ఆయన విజయవంతంగా నడుపుతున్నారు. నేడు దేశంలోనే ‘భక్తి టీవీ’ మొదటి ప్లేస్ లో ఉందంటే అది ఆయన పట్టుదల వల్లే సాధ్యమైంది అన్నది అక్కడి వారి మాట.
మానవీయ కోణం: ఎవరినైనా ఉద్యోగం నుండి తీసివేయాలనే ప్రతిపాదన వస్తే, ఆయన దాన్ని సాకారం చేయరు. “ఏదో ఒక టాలెంట్ ఉంటేనే కదా తీసుకున్నాం, ఒక విభాగంలో కాకపోతే మరో విభాగంలో అవకాశం ఇవ్వండి” అంటూ మానవీయ కోణంలో ఆలోచిస్తారు.
చివరిగా చెప్పలంటే: సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి, ఆయన అసలు వ్యక్తిత్వానికి ఎక్కడా పొంతన లేదని, ఆయన ఒక వ్యవస్థగా నిలబడి ఎంతోమందికి ఉపాధిని ఇస్తూ, విలువలతో కూడిన మీడియాను నడుపుతున్నారని ఆయనతో కలిసి పనిచేసిన వారు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పైన ఇచ్చిన కథనం సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాల్లో నరేంద్ర చౌదరి గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు మరియు గతంలో ఆయన వద్ద పనిచేసిన వారు పంచుకున్న వాస్తవాల ఆధారంగా రూపొందించబడింది.
