ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయ్యారా…? ఈ వార్త ఒక స్థాయిలో ప్రచారం జరుగుతుంది నిన్నటి నుంచి. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఉదయం నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెప్తున్నారు. దీనిపై ఉత్తరకొరియా నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా సరే అమెరికా మీడియా మాత్రం దీనిపై ఎన్నో కథనాలను ప్రసారం చేస్తూ వస్తుంది.
ఆయన ఆరోగ్యం గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారని, ఆ దేశ ప్రజలకు ఈ విషయాన్ని చెప్పారని, అయితే అంతర్జాతీయ మీడియాకు మాత్రం ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని అమెరికా మీడియా పేర్కొంది. ఈ విషయంలో ఇప్పుడు కిమ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమెరికా దాడి చేసే అవకాశం ఉంటుందని,
అందుకే ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని, అమెరికా పెత్తనం మొదలైతే తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని భావించి… విషయాన్నీ బాహ్య ప్రపంచానికి చెప్పడం లేదని పలు దేశాలు అంటున్నాయి. అయితే ఆయన… రాజధాని నగరం పాంగ్యాంగ్ లో ఒక రహస్య ప్రాంతంలో తన అత్యంత సన్నిహితులతో సమయం గడుపుతున్నారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయినా సరే తన తాత జయంతి వేడుకలకు అతను రావాలి. అతను రాకుండా ఎప్పుడు కూడా అది జరగలేదు. ఈ నెల 15 ఆ దేశంలో జాతీయ సెలవు దినం. ప్రస్తుత అమెరికా మీడియా అంతర్జాతీయ మీడియా దీనిపై కొన్ని కథనాలు ప్రసారం చేస్తూ ఆయన మరణించారు అని అంటున్నారు. ఆయనకు మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ప్రధానంగా గుండె సమస్యలు, ఉన్నాయని అంటున్నారు.
అయితే దీనిపై డైలీ ఎన్కే అనే ఒక మీడియా సంస్థ కీలక వ్యాఖ్య చేసింది. సాధారణంగా ఉత్తరకొరియా విషయాలు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదు. అక్కడ ఎం జరిగినా సరే దక్షిణ కొరియా మాత్రమే చెప్తుంది. ఆ దక్షిణ కొరియా కు చెందిన సంస్థే డైలీ ఎన్ కే. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యంపై స్పందించారు. నార్త్ కొరియా లో అసలు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదని, అంతా ప్రశాంతంగా ఉందన్నారు.
ఆ మీడియా సంస్థ… స్పందిస్తూ… ఆ వార్తలు తప్పుడు సమాచారం అని, కిమ్ సర్జరీపై తమకు ఉన్న సమాచారం, విశ్వసనీయ వర్గాల ఆధారంగా కథనాలను రాశామని, అందులోని సమాచారం ధృవీకరించడం లేదని క్షమాపణ చెప్పింది. అంటే ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు అనే వార్త పూర్తిగా అవాస్తవం అనేది అర్ధమైంది. ఆ దేశం గురించి ఏ వార్తా వచ్చినా అమెరికా హడావుడి చేస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలు దీని గురించి కథనాలు ఎక్కువగా రాసాయి.