పుచ్చ సాగులో తెగుళ్ల నివారణకు ఇలా చేసేయండి..!

-

వేసవి కాలంలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంది. ఎవరైన కొనడానికి ముందుకొస్తారు. కరోనా తీవ్రత కూడా తగ్గుడంతో.. ఈ ఏడాది మార్కెట్ బానే ఉంటుంది వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కేజీ 20 రూపాయల వరకూ పలుకుతుంది. కాసులు కురిపించే పుచ్చకాయలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..!

వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా: పుచ్చను ప‌లు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేస్తారు. పుచ్చకాయ పంటతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. రెండున్నర నెలల్లోనే పంట చేతికొస్తుంది. అయితే ఇదంతా రైతుల శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలంలో పంట చేతికి రావాలంటే.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పుచ్చకాయల ఉత్పత్తి పెరిగి రైతులకు కూడా మేలు జరుగుతుంది. మహారాష్ట్రలో పుచ్చకాయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఖాందేష్ ప్రాంతంలో సాగుచేస్తారు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పుచ్చకాయ సీజనల్ పంట. అయితే పంట నాటడానికి ముందు.. పుష్పించే కాలంలో సరిగ్గా చూసుకుంటే.. మంచి ఉత్పత్తిని ఇస్తుంది. పుచ్చకాయ పంట కోసం విత్తనాలు విత్తడం కంటే నర్సరీ నుంచి నేరుగా మొక్కలు తెచ్చి సాగు చేస్తే మేలు జరుగుతుంది.
పంటను వేయడానికి ముందు సరైన రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పుచ్చకాయలో నల్ల ఆకు, ఆకుపచ్చ ఆకులు అంటూ వివిధ రకాలు ఉన్నాయి. వ్యవసాయ భూమిని బట్టి పుచ్చకాయలోని రకాన్ని ఎంచుకోవాలి.
పుచ్చ పాదులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తే దిగుబడి బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్త రామేశ్వర్ చందక్ అంటున్నారు.

పుచ్చలో వచ్చే తెగుళ్లు..

పుచ్చ‌లో ఆకుమచ్చ తెగులు ఎక్కువ‌గా వ‌స్తుంది. నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల సాఫ్‌ మందును కలిపి మిశ్ర‌మాన్ని త‌యారుచేసి.. పంట‌పై పిచికారీ చేసుకోవాలి.
ఆకు ముడత నివారించేందుకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫిల్ లేక‌పోతే సువాస్‌ రెండు మిల్లీ లీటర్ల క‌లుపుకోవాలి. వీటితో పాటు ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి మిశ్ర‌మాన్ని త‌యారు చేసి..పంట‌పై పిచికారీ చేసుకోవాలి.
నాణ్యమైన ఉత్పత్తికి, కాయ ఎదుగుదలకు పంటకాలంలో వారానికోసారి 19:19:19 లేదా 13:0:45 లను కేజీ పరిమాణాన్ని డ్రిప్‌ ద్వారా ఫెర్టిగేషన్‌ పద్ధతిలో అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా నాణ్యతకు, నిల్వకు దోహదపడే బోరాన్‌ మూలకాన్ని బోరాక్స్‌ రూపంలో పిచికారీ చేసుకోవాలి.

కలుపు మొక్కల‌ను లేకుండా చూసుకోవాలి. మల్చి షీట్‌ రంధ్రాలలో ఎప్పటికప్పుడు పెరిగిన‌ కలుపును తీసివేయాలి. పుచ్చ మొక్క‌ల‌ను నాటిన 30 రోజుల తరువాత గొర్రు సాయంతో దున్నాలి. కాయ ఎదుగుదల దశలో ఉన్న‌ప్పుడు 4- 5 రోజుల‌కొక‌సారి కాయలను తిప్పుతూ ఉండాలి. దాంతో కాయ‌పై పసుపు రంగు మచ్చలు రావు.

కాయ పక్వానికి వచ్చినప్పుడు కాయ మొదట్లో ఉండే తీగ ఎండిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే కాయ నేలకు తగిలే భాగం పుసుపు రంగుకు మారిపోతుంది. కాయను మ‌నం చేతితో తట్టినప్పుడు డొల్లశబ్ధం వస్తుంది. డ్రిప్ , మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకోవ‌డం వ‌ల‌న మంచి లాభాల‌ను సాధించొచ్చు. ఈ ప‌ద్ద‌తి ద్వారా 20 నుంచి 25 టన్నుల దాక‌ దిగుబడిని పొందొచ్చు.

మేలైన యాజమాన్య పద్ధతుల‌ను పాటిస్తే.. రైతులకు పుచ్చ‌కాయ‌లు కాసులు కురిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version