హరీశ్ రావుకు మంత్రి దామోదర రాజనర్సింహ స్ట్రాంగ్ కౌంటర్

-

ఆరోగ్య సేవల నిలిపివేత పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్  మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. పదేండ్లు ఆరోగ్య శ్రీని నీరుగార్చి.. ఇప్పుడు అదే పథకం గురించి మాట్లాడటం చూస్తుంటే దొంగే.. దొంగ అని అరిచినట్టుగా ఉందని రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రిలకు డబ్బులు చెల్లించలేదని.. ఫ్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదని. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి పోయారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ మిగిల్చిన అప్పులను, పెండింగ్ బిల్లుల సమస్యలను ఒక్కొక్కటిగా మేము పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ పెట్టిన పాత బకాయిలతో సహా రూ.1130 కోట్లు ఏడాదిలో చెల్లించామని.. ప్రతీ నెల నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఫ్యాకేజీల రేట్లు రివైజ్ చేసి.. 22 శాతం మేరకు ఛార్జీలు పెంచామని తెలిపారు. హాస్పిటళ్ల యజమాన్యాలు లేవనెత్తిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version