వేసవిలో ఏ కూరగాయల సాగు లాభదాయకం..బిందుసేద్యం మంచిదేనా..?

-

ఆకుకూరల సాగు తెలుగురాష్ట్రాల్లో బాగానే చేస్తారు..ఇళ్లలో కూడా ఏదో ఒక ఆకు కూరను మహిళలు పెంచుతుంటారు. ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణాలో గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తమీర, పుదీనా, బచ్చలి మొదలైనవి ఎక్కువగా సాగు చేస్తారు. వీటిని సంవత్సరం పొడవునా లాభసాటిగా పంటగా పండించవచ్చు. ఆకు కూరలకు నీళ్లు అధికంగా కావాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, తక్కువ నీటిలభ్యత వల్ల కూరగాయల సాగు విస్తీర్ణం, లభ్యత తగ్గిపోతుంది.

అందుకో వేసవి కాలంలో కూరగాయల కాస్ట కాస్త ఎక్కువగా ఉంటుంది. అప్పుడు తక్కువ ధరలో వచ్చేవి ఆకుకూరలే.. రైతులు తమకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొద్దిపాటి విస్తీర్ణంలో ఆకుకూరలను సాగు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర తప్పించి మిగతా ఆకుకూరలన్నీ వేసవిలో కూడా సాగుచేసుకోవచ్చు. సాగులో ఉండే మెళుకవలు ఈరోజు చూద్దాం.

బంగాళాదుంప : స్వల్పకాలంలో పండించే శీతాకాలపు పంట, చల్లని వాతావరణం అవసరం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల ఉండదు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు మొక్క శాఖీయంగా బలంగా పెరుగుతుంది. కానీ దుంపలు పెరగవు. బరువైన ఒండ్రు నేలలు దుంప పెరుగుదలకు అనుకూలం కాదని గుర్తుంచుకోండి.

చిలగడ దుంప: ఉష్ణమండలపు పంట సమృద్ధిగా ఉండే సూర్యరశ్మి, మధ్యస్థంగా ఉండే వర్షపాతంతో పాటు రాత్రులందు ఉదయం వేళల్లో చల్లగా ఉండటం ఈ పంటకు బాగా అనుకూలంగా ఉంటుంది..

కర్రపెండలం ఈ పంటను కసాబా లేదా టాపియోకాగా కూడా పిలుస్తారు. ఈ పంటకు ఉష్ణమండలపు పంట, అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది.. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారపు పంటగా, ఆరుతడి పంటగా ఇది సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

చేమదుంప: ఉష్ణ మండల పంట. ఈ పంటకు ఎప్పుడూ భూమిలో తేమ అధికంగా ఉండాలి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇది ఎక్కువగా సాగుచేస్తారు.

కరివేపాకు: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంట 26-97 డి. సెం. గ్రే. ఉష్ణోగ్రత వరకు తట్టుకొని పెరుగుతుంది. ఉష్ణోగ్రత 16 డిగ్రీల కన్నా తగ్గితే శాఖీయ మొగ్గలు నిద్రావస్థకు చేరి పెరుగుదల ఆగిపోయో ప్రమాదం ఉంది.. దీని పెరుగుదలకు నీటిపారుదల సౌకర్యం లేని నల్లనేలలు పనికిరావు. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలి. నాటిన ఆరు నెలలకు మొదటి కోత వస్తుంది. ప్రతి కోత తర్వాత ఎరువులు వేసి నీటితడులు సక్రమంగా ఇస్తే ప్రతి మూడు నెలలకోసారి కోత కోసుకోవచ్చు.

తీగజాతి కూరగాయల సాగు: తీగజాతి కూరగాయాలల్లో..దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీర, కాకర, సొర, పొట్ల, దొండ పంటలు వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శీతాకాలంలో ఈ పంటల ఎదుగుదల తక్కువ. బీర, కాకర పంటలను చలి ఎక్కువగా ఉండి మంచు కురిసే కాలంలో సాగుచేయటం కష్టమే. మిగతా తీగజాతి కూరగాయలను నీటి సదుపాయం ఉంటే ఏడాది పొడవునా సాగుచేసుకోవచ్చు. ఈ పంటలను పందిళ్లపై సాగుచేసుకొని అధిక దిగుబడి పొందవచ్చు. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో కూడా ఇవి సాగు చేసుకోవచ్చు. దొండ పంట మాత్రం ఖరీఫ్లో నాటుకుంటే 3-4 ఏళ్లపాటు ఏడాది పొడవునా కాపునిస్తుంది. మిగతా పంటలు 3 లేదా 4 మాసాల్లో పూర్తయిపోతాయని నిపుణులు అంటున్నారు.

ఆకు కూరలకు బిందు తుంప సేద్యం ప్రాధాన్యం ఇవ్వాలి. రోజురోజుకు తగ్గుతున్న నీటివనరులను సద్వినియోగం చేసుకుంటేనే పంటల సాగు లాభసాటిగా ఉంటుంది. అందుకు బిందు (డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్) పద్ధతిలో నీటిని సరైన పద్ధతిలో పంటలకు అందించి అధిక దిగుబడి సాధించుకోవచ్చు.

బిందుసేద్యం వల్ల కలిగే ప్రయోజనాలు..

తుంపర పద్ధతిలో 90-95 శాతం వరకూ నీరు సద్వినియోగం అవుతుంది. డ్రిప్లో సర్పేస్, సబ్సర్ఫేస్, మైక్రో స్పింక్లర్ పద్ధతులున్నాయి. డ్రిప్తో 21-50 శాతం నీరు ఆదా అవుతుంది. అలాగే 30-45 శాతం. విద్యుత్తు ఆదా అవుతుంది. వివిధ పోషకాలను నీటిలో కరిగించి ఫర్టి గేషన్ ద్వారా నేరుగా వేర్ల దగ్గర అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి 20-43 శాతం ఆదా అవుతాయి.

నేలను చదును చేయడం, కాలువలు, బోదెలు చేసి నీరు పెట్టడం వగైరా పనులు ఉండవు గనుక సాగు ఖర్చు, కలుపు సమస్య తగ్గుతుంది.

పూలు, పండ్లతోటలు, వాణిజ్యపంటలు, దుంప పైర్లు, కూరగాయలు, ఔషధ, కలప పంటలను డ్రిప్తో పండించవచ్చు.

డ్రిప్ సిస్టం బాగా పనిచేయాలంటే నిపుణులతో డిజైన్ చేయించుకుని, నాణ్యమైన పరికరాలను అనుభవం ఉన్నవారితో రైతులు పొలంలో అమర్చుకోవాలి. తుంపర్ల పద్ధతిలో వివిధ పంటలకు నీరు తుంపర్లుగా, వర్షం పడినట్లు పడుతుంది.

డ్రిప్ పద్ధతిలో మాదిరిగానే స్ప్రింక్లర్ పద్ధతితో కూడా లాభాలున్నాయి. 5-20 శాతం దిగుబడి పెరుగుతుంది.

ఆకుకూరలను ఈ విధంగా సేద్యం చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version