ముత్యాల సాగును ప్రోత్సహిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం.. 50 శాతం సబ్సిడీ..!

-

ముత్యాలతో చేసిన నగలు బాగా కాస్ట్ ఉంటాయి కదా.. మరీ ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ పంట వేస్తే ఎలా ఉంటుందో..ముత్యాల సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముత్యాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఈ రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా చేరింది. ముత్యాలు పండించే రైతులకు రాజస్థాన్ ప్రభుత్వం రూ.12.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈరోజు మనం ముత్యాల పెంపకం అంటే ఏంటి, ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.

ముత్యాలు ఇలా తయారవుతాయి..

ముత్యాలు ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశించి.. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది. అలా ముత్యం తయారువుతుంది.

రైతులు ఎలా పండించాలి..?

రైతులు చెరువును నిర్మించి అందులో ఆల్చిప్పలను వేయాలి. ఈ ఆల్చిప్పలను మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. కల్చర్డ్ ముత్యాలను ఇందులో ఉత్పత్తి చేయవచ్చు. ప్రాథమికంగా మూడు రకాల ముత్యాలు ఉన్నాయి. సహజ, కృత్రిమ, కల్చర్డ్ ముత్యాలతో సహా. కల్చర్డ్ ముత్యాలు అంటే సాగు చేసి తయారు చేసినవి.

రాజస్థాన్ ప్రభుత్వం అందించే సాయం..

రాజస్థాన్ ప్రభుత్వం ముత్యాల సాగుకు 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్బిడీ కింద రాష్ట్రంలో ముత్యాలు పండించే రైతులు గరిష్టంగా రూ.12.50 లక్షలు సబ్సిడీగా పొందవచ్చు. రాజస్థాన్ ప్రభుత్వం నుండి అందిన సమాచారం ప్రకారం, ముత్యాల సాగుకు ఏడాది పొడవునా నీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కోటా డివిజన్‌లో ముత్యాల సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముత్యాల సాగుకు హెక్టారుకు రూ.25 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 50 శాతం సబ్సిడీ పొందవచ్చు. ముత్యాల సాగులో ఖర్చు ఎక్కువే లాభాలు ఎక్కువే.

Read more RELATED
Recommended to you

Exit mobile version